రీ ఎంట్రీ ఇవ్వబోతున్న రంభ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?
ఇక తెలుగులో పలువురు స్టార్ హీరోలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని తన అందం అభినయంతో కుర్రాళ్ల మతి పోగొట్టింది. అయితే మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రంభ పెళ్లి చేసుకుని చివరికి సెటిల్ అయింది. కెనడాకు చెందిన వ్యాపారవేత ఇంద్ర కుమార్ పద్మనాథన్ను 2010లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇక వైవాహిక జీవితాన్ని గడుపుతుంది. కాగా ప్రస్తుతం రంభ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
అయితే ప్రస్తుతం వెండితెరపై కనిపించక పోయిన రంభ సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలని పోస్ట్ చేస్తూ ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఇప్పుడు దాదాపు దశాబ్దన్నర కాలం తర్వాత రంభ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందట. పిల్లలు పెద్దవారు కావడంతో నటిగా మారి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని డిసైడ్ అయిందట. ఇందులో భాగంగానే టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో మూవీకి ఇప్పటికే సైన్ చేసిందట ఈ నిన్నటి తరం స్టార్ హీరోయిన్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా బయటకు రాబోతున్నాయని సమాచారం. దీంతో రంభ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.