తారక్ 'దేవర' మూవీలో.. పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ?

praveen
త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకేకుతున్న ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే దేవర మూవీ రెండు పార్ట్ లుగా రిలీజ్ కాబోతుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా.. ఈ మూవీని నిర్మిస్తూ ఉండడం గమనార్హం.


 ఇక ఈ సినిమాలో తారక్కు జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోంది. ఈ బాలీవుడ్ హీరోయిన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక ఈ మూవీలో రెండో హీరోయిన్ పాత్ర కోసం మరో బాలీవుడ్ హీరోయిన్ అయినా దిశ పఠానిని  కూడా తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దేవర సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్కు అక్క పాత్రలో మంచు లక్ష్మీ నటించబోతుంది అంటూ ఒక వార్త ఇండస్ట్రీని ఊపేసింది. ఇక ఇప్పుడు మరో పాత్ర గురించి చర్చ మొదలైంది.



 దేవర మూవీలో ఒక క్రేజీ పవర్ఫుల్ పాత్ర ఉందట. ఇక ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల అనుకున్నాడట. ఈ క్రమంలోనే కథను రమ్యకృష్ణ కు వినిపించగా ఆమె కూడా ఓకే చేశారట. ఇక దేవర కోసం ఆమె నవంబర్ మొదటి వారంలో డేట్లు కేటాయించారు అన్నది తెలుస్తుంది. అయితే ఈ పవర్ ఫుల్ పాత్రకు తారక్ పాత్రకు మధ్య మంచి సన్నివేశాలు ఉంటాయట. అయితే గతంలోను ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణ సింహాద్రి సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించగా ఆ తర్వాత నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్కు అత్తగా నటించింది రమ్యకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: