బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కి.. రికార్డు స్థాయి టిఆర్పి రేటింగ్?
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అందరికీ తెలిసిన వాళ్లే కావడంతో.. ఇక ఈ సీజన్ చూడటానికి ప్రేక్షకులు కూడా బాగానే ఆసక్తిని చూపుతున్నారు. అయితే కంటెస్టెంట్స్ మధ్య మాటలు యుద్ధం.. విభీన్నమైన టాస్కులతో ఈ సీజన్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. అయితే ఇప్పటికే 8 వారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో సందీప్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక సందీప్ ఎలిమినేషన్తో శోభా శెట్టి, ప్రియాంక కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ఎమోషనల్ సీన్స్.. నాగార్జున క్లాస్ తో వీకెండ్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి.
అయితే గత వీకెండ్ ఎపిసోడ్ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుని అన్నది తెలుస్తుంది. వీకెండ్ ఎపిసోడ్ కి ఏకంగా అర్బన్ ఏరియాలో 9.07 టిఆర్పి రేటింగ్ రాగా.. రూరల్ ఏరియాలో 7.3 8 టిఆర్పి రేటింగ్ వచ్చిందట. ఇక మిగతా ఎపిసోడ్స్ కి అర్బన్ ఏరియాలో 6.9 టిఆర్పి రాగా రూరల్ ఏరియాలో 5.31 టిఆర్పి రేటింగ్ వచ్చింది. అయితే ఈ సీజన్లో వీకెండ్ ఎపిసోడ్ కి వచ్చిన హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ ఓ ఎపిసోడ్కి ఈ రేంజ్ లో రేటింగ్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే ఈ వీక్ మొత్తం ప్రతి ఎపిసోడ్స్ కి కూడా ఇదే స్థాయిలో టిఆర్పి రేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది.