బాలయ్య డైరెక్టర్స్ లిస్ట్ ఇదే.. మరి మాటిచ్చిన సినిమా సంగతేంటో?

praveen
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ హీరోలకు మించిన స్పీడ్ తో దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఇటీవల భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక సినిమా విడుదలైంది అంటే చాలు మరో కొత్త సినిమా మూడ్ లోకి వెళ్ళిపోతున్నారు. బాలయ్య 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా ఒకవైపు సినిమాలతో మరోవైపు అన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో తో కూడా బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య.



 ఇక బాలయ్య కెరియర్ లో 19వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. అయితే ఆ తర్వాత బాలయ్య 110, బాలయ్య 111 సినిమాల గురించి కూడా ఇప్పటికే చర్చ మొదలైంది.  అయితే ఈ మూవీల విషయంలో అటు తనకు హిట్ ఇచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట బాలయ్య. బాలయ్య కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అఖండ సినిమాకు సీక్వల్ ఉంటుందని ఇప్పటికే బోయపాటి శ్రీను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య 110 బోయపాటి సినిమానే అవుతుందని తెలుస్తుంది. అదే సమయంలో వీర సింహారెడ్డి తో హిట్టిచ్చిన గోపీచంద్ కి కూడా మరో ఛాన్స్ ఇచ్చాడట బాలయ్య. ఇక బాలయ్య 111 సినిమా కూడా గోపీచంద్ తో ఉండబోతుందట.


 కానీ గతంలో బాలయ్య మాటిచ్చిన ఒక సినిమా సీక్వల్ మాటేమిటి అని అటు అభిమానులు మాత్రం ప్రశ్నిస్తున్నారు. బాలయ్య కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఏది అంటే ఫస్ట్ వినిపించే పేరు ఆదిత్య 369. ఈ సినిమాకు సీక్వల్ గా ఆదిత్య 999 తీస్తానని గతంలో బాలయ్య చెప్పారు. అయితే ఈ మాట చెప్పి ఎన్నో రోజులు అవుతున్న.. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా తెరమీదికి రాలేదు. బాలయ్య 110 సినిమాగా ఈ మూవీ వస్తుందని అనుకున్న.. ఇప్పట్లో ఇది కుదిరేలా లేదు. అలాగే మోక్షజ్ఞతో బాలయ్య నిర్మాతగా ఒక సినిమా చేస్తాడని అనుకున్న.. ఈ సినిమా గురించి కూడా బాలయ్య పట్టించుకోవట్లేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ntr

సంబంధిత వార్తలు: