సిద్ధార్థ్ -అదితి లవ్ ఫై ట్విట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి..!!

Divya
 బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈమె మంచి పాపులారిటీ అందుకున్నది. అవకాశం వచ్చినప్పుడు అల్లా తనని తాను నిరూపించుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. చివరిగా ఈమె తెలుగులో మహాసముద్రం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన నిరాశనే మిగిల్చాయి. గతంలో కూడా అదితి రావు హైదరి కి వివాహమై భర్త నుండి దూరంగా ఉన్నది. ప్రస్తుతం ఇమే సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది.



అయితే మహాసముద్రం సినిమా సమయంలో మరొకసారి ఆమె నటుడు సిద్ధార్థాతో ప్రేమలో పడినట్లుగా పలు రకాల వార్తలు టాలీవుడ్లో వైరల్ గా మారాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తరచూ చట్ట పట్టాలేసుకొని పబ్లిక్కుగా తిరిగేస్తూ ఉండడంతో ఈ విషయం మరింత నమ్మసక్యంగా మారింది. ప్రస్తుతం అదితి, సిద్ధార్థ్ ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారని వీరి ప్రేమకి  కారణం మహాసముద్రం సినిమా నుంచి మొదలయ్యింది అనే రూమర్స్ సైతం వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంలో ఓపెన్ కాలేదు. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి ఒక ఫన్నీ ట్విట్ చేయడం జరిగింది.



సిద్ధార్థ్ -అదితి  సన్నిహితంగా ఉన్న ఫోటోని ఉద్దేశిస్తూ దినంతటికీ కారణం నేనే అంత అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో అంటూ అజయ్ భూపతి చాలా ఫన్నీగా ట్విట్టర్లో పోస్టులు చేయడం జరిగింది. అజయ్ భూపతి ట్వీట్ పై పలువురు నెట్టిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొందరైతే ఇప్పుడేంటి వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే నీ పేరు పెట్టాలా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. మరి కొంతమంది మొత్తం మీరే చేశారు అంటూ సిద్ధార్థ బొమ్మరిల్లు సినిమా డైలాగులు సైతం పోస్ట్ షేర్ చేయడం జరుగుతోంది. ఇదంతా ఇలా ఉండగా అజయ్ భూపతి -పాయల్ రాజ్ కాంబినేషన్లో వస్తున్న మంగళవారం సినిమా నవంబర్ 17న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: