వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. వెడ్డింగ్ కార్డ్ ఎంతో తెలుసా..?
రిసెప్షన్ వేడుకలను హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ హాల్ భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్లు సమాచారం. వీరు దాదాపుగా ఆరేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎప్పుడు కూడా వీరిద్దరికి సంబంధించి ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా వాటి మీద ఎప్పుడు స్పందించలేదు.. ఇద్దరూ కలిసి పలు సినిమాలలో నటించిన సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిహారిక లావణ్య త్రిపాఠి కూడా మంచి స్నేహితులు అయ్యారు.
ఇదంతా ఇలా ఉండగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా సరే వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఆహ్వాన పత్రిక సుమారుగా 60 వేల రూపాయలు ఒక్కొక్కటి ఉన్నట్లు సమాచారం.. ప్రత్యేకమైన డిజైన్తో ఈ ఆహ్వాన పత్రికను స్పెషల్గా తయారు చేయించారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పెళ్లి పత్రికలను సుమారుగా ఒక 50 వరకు కొట్టించినట్లు సమాచారం.. ఇంత ఖర్చు ఒక మధ్య తరగతి కుటుంబం వివాహమే చేసుకుంటుంది ఇంతటి ఖర్చుతో అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి వీరి పెళ్లికి ఎవరెవరు వెళ్తారో చూడాలి మరి.