తెలుగు రాష్ట్రాలలో టాప్-10..100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చిత్రాలు ఇవే..!!
మొదట బాహుబలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో 2017 వ సంవత్సరంలో బాహుబలి 2 100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ని చేసింది.. ఇక తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా కూడా 2019లో అంత బిజినెస్ ను అందుకుంది. అలాగే చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా 2019లో 100 కోట్ల ఫ్రీ రిలీజ్ వాల్యూడ్ బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా 2021 లో మొదటిసారి 100కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్..RRR సినిమాలతోపాటు ఆచార్య, ఆది పురుష్, సలార్, ప్రస్తుతం మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 100 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో ముఖ్యంగా ప్రభాస్ నటించిన సినిమాలే ఐదు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా ఈ లిస్టులోకి చేరబోతాయని చెప్పవచ్చు. మరి ఏ హీరో అత్యధిక కలెక్షన్లను రాబట్టి అభిమానులను మెప్పిస్తారో చూడాలి మరి. మహేష్ బాబు మొదటిసారి గుంటూరు కారం సినిమాతో 100కోట్ల ప్లీజ్ బిజినెస్ జరుగుతోంది.