స్ట్రెస్ ఎక్కువైతే మహేష్ బాబు అలాంటి పనులు చేస్తాడా.....??

murali krishna
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తండ్రి కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక స్టయిల్ ఏర్పాటు చేసుకున్నాడు.మరీ ముఖ్యంగా కూల్ అండ్ హాండ్ సమ్ కు పెట్టింది పేరు మహేష్ బాబు. మహేష్ హీరోగానే కాకుండా భర్తగా, తండ్రిగా అన్ని బాధ్యతలు తీర్చడంలో సఫలం అయ్యారు. అయితే మహేష్ కి కోపం వస్తే మాత్రం తనముందు ఎవరూ నిలవలేరట. అవును, ప్రతి మనిషికి ఒక మైనస్ వుంటుంది. ఏదో ఒక సందర్బంలో కోపం, చిరాకు, ఒత్తిడి అనేవి రావడం చాలా కామన్.ఈ విధంగా మహేష్ బాబుకు చాలా సందర్భాలలో స్ట్రెస్ ఫీలవుతారని వినికిడి. అందుకనే ఈ సమయంలో మహేష్ ఎక్కువగా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తారట. సహజంగా ఇతరులకు కోపం వస్తే.. బయటకు వెళ్లడం, మందు కొట్టడం, లేదా గొడవ పడడం చేస్తుంటారు.కానీ మహేష్ బాబు అలా కాదు, బంగారం. మొదట్లో పీక్స్ లో వున్న కోపాన్ని ఎదురివారి పైన చూపేవారట. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక బలహీనతని బలంగా మార్చుకున్నారు మహేష్ బాబు.
ఇప్పుడు మాత్రం ఇతరుల మీద కోపం చూపించడం, ఇంట్లో గొడవ పెట్టుకోవడం వంటివి అస్సలు చేయరట..  కోపం నుంచి బయటపడటానికి, తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతారట. ఇక తాను అధికంగా ఒత్తిడికి గురైతే కనక ఒంటరిగా ట్రిప్ వెళ్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారని సమాచారం. అందరూ ఇలా ఆలోచిస్తే కోపం కంట్రోల్ కావడం చాలా తేలిక. కోపం ఎక్కువైతే ఒత్తిడి పెరుగుతుంది.తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అందుకే అందరూ కూడా ఇలాంటి మార్గం ఎంచుకుంటే బాగుంటుంది అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ముఖ్యంగా మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమలో ప్రేమ పెళ్లి తర్వాత విడిపోతున్న జంటలు ఎందరో వున్నారు.కానీ వీరిద్దరు మాత్రం ఇప్పటికి గొడవలు లేకుండా కలిసే ఉంటున్నారు. అదే మహేష్ బాబు అని గొప్పగా అంటున్నారు ఘట్టమనేని అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: