అడ్డంగా దొరికిపోయిన కిరణ్ అబ్బవరం.. ఆ హీరోయిన్ తో లవ్ కన్ఫామ్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారి సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎలా అయితే ఎదురు చూస్తారో.. ఇక పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అంతకంటే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎవరైనా హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు అని తెలిస్తే చాలు అది నిజమేన కాదా అని తెలుసుకోవడానికి ఫాన్స్ అందరు కూడా తెగ ఆరాటపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలో ప్రేమ విషయం అభిమానులతో పంచుకుంటే.. ఇంకొంతమంది మాత్రం కాస్త సీక్రెట్ గానే రిలేషన్షిప్ మైంటైన్ చేయాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకునే హీరోలలో.  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం  కూడా ఉన్నాడు. అయితే సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి అనుకుంటాడు. కానీ ఎప్పుడూ అడ్డంగా బుక్ అవుతూ ఉంటాడు. అయితే ఈ యంగ్ హీరో టాలీవుడ్ లో మొదటి సినిమా హీరోయిన్ నే పెళ్లి చేసుకున్న హీరోల జాబితాలో చేరిపోతాడా అంటే మాత్రం ప్రస్తుతం నిజమే అంటున్నారు అభిమానులు. ఎందుకంటే తన ప్రేమ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు అడ్డంగా బుక్ అవుతూనే వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రాజా వారు రాణి గారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించింది రహస్య గోరక్.


 అయితే ఈ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అని ఎన్నో రోజుల నుంచి టాక్. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమను అధికారికంగా అభిమానులకు అస్సలు చెప్పలేదు. కానీ ఎప్పుడూ ఈ ఇద్దరు లవ్ బర్డ్స్ ఏదో ఒకచోట కలిసి కనిపిస్తూనే ఉన్నారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సక్సెస్ తర్వాత కిరణ్ కిరణ్ వెకేషన్ వెళ్ళాడు. అయితే కిరణ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. రహస్య కూడా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోటోలు వెనుక బ్యాక్ గ్రౌండ్ ఒకటే ఉండడంతో ఈ ప్రేమ జంట వెకేషన్కు కలిసి వెళ్లారు అంటూ అందరూ చర్చించుకున్నారు. ఇటీవలే మరోసారి ఈ హీరో అడ్డంగా బుక్ అయ్యాడు.


ఇటీవల దావత్ అని షోలో కిరణ్ గెస్ట్ గా విచ్చేసాడు. అయితే ఇందులో హోస్ట్ అషు రెడ్డి రహస్య గురించి అడగగానే ముందు మన ఇద్దరి మధ్య ఏం లేదని.. ఏదైనా ఉంటే మేమే చెప్తామని కిరణ్ చెప్పాడు. ఆ తర్వాత మేము అంటున్నారంటే ఏదో ఉంది అనగానే కిరణ్ సిగ్గు పడుతూనే.. ఇన్ని ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇలా దొరికిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వీరి రిలేషన్ అని కన్ఫామ్ అయిందని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: