లగ్జరీ కార్ కొనుగోలు చేసిన శ్రద్ధా కపూర్.. ఎన్ని కోట్లు అంటే..?

Divya
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు ఫోటోలను పంచుకోగా ఇప్పుడు వాటి ఫోటోలు, ధర మరింత వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. దసరా సందర్భంగా కోట్లు ఖర్చు పెట్టి ఆమె కార్ సొంతం చేసుకుంది. తాజాగా కారును డ్రైవ్ చేస్తూ ముంబైలోని జుహూ వీధుల్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.



ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ లో తన కొత్త కారుకు పూజలు చేయించేందుకు స్వయంగా డ్రైవ్ చేస్తూ ఆలయానికి వెళ్ళింది శ్రద్ధా కపూర్. ఇక ఆ కారుకు పూజలు చేయించిన అనంతరం ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది .ఇకపోతే కొనుగోలు చేసిన ఈ కార్ లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా కార్ అన్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే ఈ కారు కోసం ఏకంగా  రూ .4కోట్ల వరకు ఖరీదు చేసి కొనుగోలు చేసిందట. ఇక ఈ కారు ధర చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే కారు కొన్న సంతోషంలో శ్రద్ధ తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వీధుల్లోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది నెటిజన్ లు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు ఎందుకంటే హై ఎండ్ కారుతో కాలుష్యం ఏర్పడదా  అంటూ ఆమెను విమర్శిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా ఉన్నట్టుండి ఆమెను విమర్శలకు గురి చేయడానికి కారణం కూడా లేకపోలేదు 2019లో ముంబైలోని ఆరే ఫారెస్ట్ బెల్ట్ లో మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో శ్రద్ధ కపూర్ చురుకైన పాత్ర పోషించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఆక్టివిస్ట్ గా కూడా అవతారం ఎత్తింది .అలాంటి ఈమె ఇప్పుడు లంబోర్ఘిని కారును కొనుగోలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు మండిపడుతున్నారు.  గతంలో సేవ్ ఆరే అనే టీషర్టు ధరించి నిరసన చేసిన ఫోటోలను మళ్లీ షేర్ చేస్తూ సేవ్ ఆరే పై మీ కమిట్మెంట్ ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికైతే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: