సల్లు భాయ్ అలాంటి వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు....!!

murali krishna
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సల్మాన్ ఖాన్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా షారుఖ్ ఖాన్ పట్ల ఎంతోమంది ప్రశంసల కురిపించగా అదే స్థాయిలో ఈయన పై విమర్శలు చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఇలా సల్మాన్ ఖాన్ పట్ల తరచూ ఎన్నో రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి సల్మాన్ ఖాన్ గురించి బాలీవుడ్ నటుడు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ పచ్చి అబద్దాల కోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అసలు సల్మాన్ ఖాన్ పట్ల ఇలాంటి విమర్శలు చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు తన పట్ల అలాంటి విమర్శలు చేశారు అనే విషయానికి వస్తే.. కుచ్ కుచ్ హోతా హై సినిమా విడుదలై 25 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించాడు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా విడుదల సమయంలో సల్మాన్ ఖాన్ ఈ షోలో మాట్లాడుతూ ఈ సినిమాలో అమన్ పాత్రలో నటించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.   కొంతమంది సలహా మేరకు కరణ్ తన వద్దకు వచ్చారు అంటూ సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఈ సినిమాలోని అమన్ పాత్రలో నటించడానికి ముందుగా కరణ్ సైఫ్‌ను చంద్రచూడ్ సింగ్‌ అడిగాను. కానీ వాళ్ళు నాతో సినిమా చేయనున్నారని చెప్పారని కరణ్ చెప్పాడని సల్మాన్ ఖాన్ వెల్లడించారు అయితే ఈ వ్యాఖ్యలను నటుడు చంద్ర చూడ్ సింగ్  తప్పుపడుతూ సల్మాన్ ఖాన్ పై విమర్శలు చేశారు.

సల్మాన్ ఖాన్ నా పట్ల అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు సినిమాలే లేవు అంటూ సల్మాన్ ఖాన్ అబద్ధాలు చెబుతున్నారు. ఆ సమయంలో నేను వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నానని చంద్రచూడ్ వెల్లడించారు. ఇక ఈయన కుచ్ కుచ్ హోతా హై సినిమా విడుదల సమయంలో నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారని ఆ సమయంలో ఆయన కూడా ఎంతో బిజీగా ఉన్నారని మా విషయంలో సల్మాన్ ఖాన్ అన్ని అబద్ధాలే చెప్పారు అంటూ చంద్రచూడ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: