క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ కనకాల....!!

frame క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ కనకాల....!!

murali krishna
కొంతమంది సెలబ్రెటీలు తెలిసో తెలియక నోరు జారుతుంటారు. అదికాస్తా ట్రోల్ అయిన తర్వాత క్షమాపణలు చెప్తూ ఓ వీడియోను రిలీజ్ చేస్తారు.. ఇలా చాలా మంది సెలబ్రెటీలకు జరిగింది.కొంతమంది కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు అది వేరే బ్యాచ్ అనుకోండి. ఇక్కడ స్టార్ యాంకర్ సుమ నోరు జారి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏకంగా మీడియాతోనే పెట్టుకున్నారు సుమ. స్టార్ యాంకర్ గా సుమకు మంచి పేరు ఉంది. బుల్లితెర పై ఆమె ఓ లేడీ సూపర్ స్టార్ అనే చెప్పాలి. ఎలాంటి ఈవెంట్ అయ్యిన సుమ అవలీలగా హ్యడిల్ చేసి తన సత్తా చాటుకుంటారు. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ చక్కటి తెలుగు మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు సుమ.ఆమె చలాకీ తనం.. సమయస్పూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చాల సందడిగా హోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఆమె మాటలు కాస్త హద్దు దాటాయి. దాంతో ఆమె మీడియా కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 


ఏదైనా ఎక్కువైతే అది మంచిది కాదు అని నిన్నే బిగ్ బాస్ షోలో శివాజీ చెప్పాడు. ఇక్కడ అదే జరిగింది.వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆదికేశవ మూవీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. అయితే ఈ ఈవెంట్ ను హోస్ట్ చేస్తోన్న సుమ.. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు కదా! త్వరగా వచ్చి కెమెరాలు పెట్టండి' అని మీడియా మిత్రలతో అన్నారు. దానికి ఓ జర్నలిస్ట్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీరు మీడియా గురించి అలా మాట్లాడకుండా ఉంటే మంచి అని అన్నారు. దానికి మరోసారి సెటైరికల్ గా సరే సరే స్నాక్స్ స్నాక్స్‌లానే తిన్నారు సరేనా..! అంటూ కామెడీ చేయాలని ట్రై చేసింది దాంతో ఆ జర్నలిస్ట్ ' ఇదే ఇదేనండీ వద్దు ' అని తన స్టైల్ లో మరో కౌంటర్ వేశారు. దాంతో సుమ మీడియాకు క్షమాపణలు చెప్పింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: