"యూఎస్ఏ" లో జోష్ చూపిస్తున్న "లియో"..!

frame "యూఎస్ఏ" లో జోష్ చూపిస్తున్న "లియో"..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఈ సంవత్సరం మొదట వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వారిసు సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న విజయ్ తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించాడు.


లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... అర్జున్ సర్జ., సంజయ్ దత్ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది.


అయినప్పటికీ ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ.కి "యు ఎస్ ఏ" లో కూడా మంచి డీసెంట్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకి "యూ ఎస్ ఏ" లో  వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీ కి ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" లో 4.1 మిలియన్ గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: