కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటిని కూల్చిన తమిళనాడు ప్రభుత్వం....!!

murali krishna
కోట్లాది మంది అభిమానులు దైవంగా కొలిచే స్టార్ హీరోలకంటే రాజకీయ నాయకులూ ఎంతో పవర్ ఫుల్ అని అంటుంటారు పెద్దలు. రాజకీయ నాయకులకు సినిమా స్టార్స్ కంటే ఎక్కువ క్రేజ్ మరియు అభిమానం జనాల్లో ఉండకపోవచ్చు.కానీ వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. పవర్ ఉంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా ఒక ఆట ఆడుకోవచ్చు. మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ ప్రభుత్వం గుప్పిట్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా అన్నీ అనుకూల పరిస్థితిలో విడుదల చేసుకోవాలి అంటే కచ్చితంగా ప్రభుత్వం అనుమతి కావాల్సిందే.ఆ రేంజ్ కి వచ్చేసింది. ఇక ప్రత్యేకించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను ప్రభుత్వం ఏ రేంజ్ లో తొక్కుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తమిళనాడు లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం.తమిళం లో ఉండే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలలో ఒకడు అజిత్ కుమార్. రజినీకాంత్ తర్వాత అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక హీరో ఈయన.
అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడు మొత్తం పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ ఇంటి పై నేడు అధికారులు దాడులు జరిపారు. విషయం లోకి వెళ్తే అజిత్ నివసిస్తున్న ఇంటి పరిసరాల్లో రోడ్డు విస్తరణ తో పాటుగా వర్షపు నీరు చేరడానికి ఒక డ్రైనేజి ని కట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతం లో ఉన్న 50 ఇళ్లను అధికారులు కూల్చేశారు.ఆ పరిధిలో అజిత్ ఇల్లు కూడా ఉన్నందున ఆయన ఇంటిని కూడా కూల్చేశారు. కానీ ఇల్లు మొత్తాన్ని కాదు, ఇంటి చుట్టూ విస్తరించిన అతి పెద్ద ప్రహరీ గోడని కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు.అజిత్ ఇంటిని కూల్చేస్తున్నారు అంటూ వార్తలు రావడం తో వందలాది సంఖ్యలో అభిమానులు అజిత్ ఉంటున్న ఇంటిని ముట్టడించారు. ఆ తర్వాత కేవలం ప్రహరీ గోడని మాత్రమే కూల్చారు అనే విషయం తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు.ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభం లో ఆయన 'తూనీవు' చిత్రం తో మన ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన 'విదాముయార్చి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: