"హాయ్ నాన్న" మూవీలో ఐటెం సాంగ్ లో కనిపించనున్న ఆ క్రేజీ బ్యూటీ..?

frame "హాయ్ నాన్న" మూవీలో ఐటెం సాంగ్ లో కనిపించనున్న ఆ క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం ఇప్పటికే దసరా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా నాని కి ఇండియా వ్యాప్తంగా నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే దసరా లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ... సౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం అక్టోబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.  ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కే జీ న్యూస్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ... అందులో భాగంగా ఈ సాంగ్ కోసం ఒక ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు అందుకోసం ఇప్పటికే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శృతి హాసన్ ను ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించగా ఈ నటి కూడా ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: