అనిల్ రావిపూడిను ఆ విధంగా ట్యాగ్ చేసిన హాట్ బ్యూటీ అనసూయ....!!

murali krishna
అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్న తర్వాత బాలయ్య నటించిన భగవంత్ కేసరి దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమాలో హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య వయసుకు తగ్గ పాత్ర చేయడం, అనిల్ రావిపూడి ఆడపిల్లల గురించి బాలయ్య చేత ఇప్పించిన మెసేజ్ అందరికీ కనెక్ట్ అవుతోంది. ఈ సినిమాలో శ్రీ లీల నటనకి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో అనిల్ రావిపూడి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో ఆడపిల్లలకు అర్ధం అయ్యేలా ఒక సీన్ రాసుకున్నారు.

ఆడపిల్లల శరీర భాగాలని ఎక్కడ టచ్ చేయకూడదో చెబుతూ స్కూల్ కార్యక్రమంలో బాలయ్య వివరిస్తూ అలా ఎవరైనా చేస్తే వెంటనే అమ్మకు చెప్పాలని బాలయ్య మాట్లాడిన డైలాగులు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక తాజాగా ఈ విషయం మీద నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలని చైతన్య వంతులని చేయడంలో ది. మిగిలిన మాధ్యమాలకు పదేళ్లు పడుతుంది కానీ భగవంత్ కేసరి సినిమా ద్వారా కేవలం వారంలోనే రీచ్ అయింది అని రాహుల్ రవీంద్రన్ రాసుకొచ్చాడు. ఇక దీనిపై అనసూయ స్పందిస్తూ ఈ విషయం గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పలేమని రాసుకొచ్చిందో. భగవంత్ కేసరి చిత్రం గురించి నేను ఫీల్ అవుతున్న విషయాన్ని మీరు చెప్పినందుకు థాంక్యూ రాహుల్ రవీంద్రన్, బాలకృష్ణ సర్ చెప్పిన డైలాగ్స్ ని మరచిపోలేము అని రాసుకొచ్చింది. ఆ లైన్స్ ని నేను సోషల్ మీడియా కోట్స్ లో వాడేస్తా.. ఎందుకంటే.. ఐ (డోంట్) కేర్ బ్రో అంటూ అనిల్ రావిపూడిని కూడా అనసూయ ట్యాగ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: