శివాజీ బయటకెళ్ళకుండా.. బిగ్ బాస్ అందుకే ఆపుతున్నాడా?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం ఏడవ సీజన్లో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఇప్పుడు వరకు గడచిన సీజన్లతో పోల్చి చూస్తే ఈ కొత్త సీజన్ మాత్రం వినూత్నంగా ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడంలో సందేహం లేదు. సరికొత్త టాస్కులతో ప్రతివారం నాగార్జున ఇస్తున్న ట్విస్టులతో ఇక అంతా రసవత్తరంగా సాగుతోంది. లేడీ కంటెస్టెంట్స్, మెయిల్ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు అయితే షోని మరింత వాడి వేడిగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఎప్పటి లాగానే నాగార్జున శనివారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపుతు క్లాస్ పీకడం ఇక ఆదివారం ఒకవైపు ఎంటర్టైన్మెంట్ పంచుతూనే.. చివరికి ఎలిమినేట్ చేయడం చేస్తూ వస్తున్నాడు. అయితే ఒక కంటెస్టెంట్ విషయంలో మాత్రం బిగ్ బాస్ కాస్త ఫేవరెటిజం చూపిస్తున్నాడు అంటూ గత కొంతకాలం నుంచి అందరూ చర్చించుకుంటున్నారు. అతను ఎవరో కాదు శివాజీ  బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన నాటి నుంచి కూడా శివాజీ మాటలతో మాయ చేస్తూనే ముందుకు సాగుతున్నాడు  అయితే అతను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు అన్నాడు.

 ఇక మిగతా కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే గేమ్స్ లో కూడా శివాజీ ఎక్కడ అంత యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించలేదు. అయినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం శివాజీని బయటకు పంపించడం లేదు. దీంతో ఎంతో మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారు  కానీ శివాజీని ఎందుకు ఇంకా హౌస్ లోనే కొనసాగిస్తున్నారు అని అందరిలో ఒక ప్రశ్న మొదలైంది. అయితే శివాజీని బయటకు పంపించకపోవడానికి వెనక పెద్ద కారణమే ఉందట. శివాజీ వెళ్ళిపోతే బిగ్ బాస్ రేటింగ్ ఒక్కసారిగా పడిపోతుందని నిర్వాహకులు అనుకుంటున్నారట. అతను లేకపోతే షో అంత రసవత్తారంగా సాగదని భావించే.. ఇక రేటింగ్స్ కోసం అతని ఇంకా హౌస్ లోనే ఉంచుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: