రష్మిక తో అలాంటి సాహసం చేస్తున్న హీరో రాహుల్ రవీంద్ర.. సక్సెస్ అయ్యేనా..!!

Divya
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలె పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, టాలీవుడ్ ,కోలీవుడ్ వంటి భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నది. ప్రస్తుతం పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తున్న రష్మిక ఇప్పుడు తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ తో పాటు చిన్న గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో నటించగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ కావడం జరిగింది. ఈ వీడియోలో నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నాను అంటే దానికి ఫ్రెండ్స్ ఫామిలీ ఎవరు అక్కర్లేదు రా.. నేను ఉంటే చాలు.. 24 గంటలు నాతోనే ఉండాలనిపిస్తుంది.. నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు ఆ కిక్కే వేరు రా అని చెప్పే డైలాగ్ ఓవర్ తో గర్ల్ ఫ్రెండ్ సినిమా మోషన్ గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాని నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది.


ఈ ప్రపంచం ప్రేమ కథలతో నిండిపోయి ఉంది కానీ ఈ ప్రేమ కథలో ఇప్పటివరకు ఎవరు వినని చూడని విధంగా ఉండబోతుందని రష్మిక కూడా సరికొత్తగా కనిపించబోతోందని.. ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర బృందం. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలియజేశారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజున మొదటి షెడ్యూల్ ఊటీలో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో తన కెరియర్ మారుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: