అక్కినేని అఖిల్ కెరియర్ గురించి.. బాంబు పేల్చిన వేణుస్వామి?

praveen
వేణు స్వామి.. ఈ పేరు ఎక్కడైనా వార్తల్లో కనిపించింది అంటే చాలు పని పక్కన పెట్టి మరి వేణు స్వామి ఏం కామెంట్స్ చేశాడు అని తెలుసుకోవడానికి నేటి రోజుల్లో సీని జనాలు బాగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే వాళ్లది వీళ్లది కాదు ఏకంగా అందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తెగ ఫేమస్ అయిపోయాడు వేణు స్వామి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు కూడా నిజం కావడంతో చాలామంది సెలబ్రిటీల సైతం ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. దీంతో నిధి అగర్వాల్, రష్మిక మందన్న లాంటి స్టార్ హీరోయిన్ సైతం వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది.


 ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు ఈ సినీ జ్యోతిష్యుడు. ఇంతకీ ఇప్పుడు ఎవరి జాతకం చెప్పాడు అంటారా.  అక్కినేని హీరో అఖిల్ జాతకం చెప్పాడు  గతంలో అక్కినేని హీరో అయినా నాగచైతన్య గురించి వేణు స్వామి చెప్పిన విషయం నిజమైంది.  నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చెప్పాడు వేణస్వామి. ఇలా చెప్పినప్పుడు అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి.. ఏదో సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం వేణు స్వామి ఇలా చెబుతున్నాడు అని విమర్శలు కూడా చేశారు.


 ఆ తర్వాత సమంత, నాగచైతన్య నిజంగానే విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో అక్కినేని హీరో అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. ప్రస్తుతం అఖిల్ జాతకం అస్సలు బాగోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్ జాతకం బాగుపడాలి అంటే ఒక పని చేయాలని సొల్యూషన్ కూడా చెప్పాడు. ఈ అక్కినేని హీరో ఎప్పుడైతే తల్లి మాట వినడం మానేస్తాడో.. అప్పటినుంచి అతని జీవితం బాగవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు  ఈ విషయంలో నాగార్జున కలగజేసుకొని అఖిల్ జీవితాన్ని తీర్చిదిద్దాలని వేణు స్వామి కామెంట్స్ చేశాడు. నాగార్జున చెప్పింది వింటే అటు అఖిల్ జీవితం బాగుంటుంది అంటూ తెలిపాడు వేణు స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: