నాచురల్ స్టార్
నాని ఈ సంవత్సరం ఇప్పటికే
దసరా అనే పాన్
ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ
మూవీ లో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ...
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇకపోతే
దసరా మూవీ తో పాన్
ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ప్రస్తుతం హాయ్
నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో మృనాల్ ఠాకూర్ ...
నాని కి జోడిగా నటిస్తూ ఉండగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ ని మొదట
డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.
ఆ తర్వాత ఈ
మూవీ ని నుండి 21 వ తేదీన కాకుండా
డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో
నాని ప్రస్తుతం తన తదుపరి
మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. నాని తన తదుపరి
మూవీ ని డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన క్రేజీ న్యూస్ ను ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
నాని తదుపరి
మూవీ డి
వి వి బ్యానర్ లో
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనునట్లు చిత్ర బృందం కన్ఫామ్ చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన అన్ చైనెడ్ ను
అక్టోబర్ 23 వ తేదీన అలాగే ముహూర్తం ను
అక్టోబర్ 24 వ తేదీన ఖరారు చేసినట్లు ఈ మూవీ మేకర్స్ తెలియజేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.