అఫీషియల్ : ఆ దెబ్బకి టైగర్ నాగేశ్వరరావు రన్ టైమ్ తగ్గింపు..!

frame అఫీషియల్ : ఆ దెబ్బకి టైగర్ నాగేశ్వరరావు రన్ టైమ్ తగ్గింపు..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ లో రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ పాత్ర పోషించడంతో ఈ సినిమాలో రవితేజ కూడా దొంగ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ లో నూపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు రవితేజ కు జోడిగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మురళి శర్మ , నాజర్ , అనుపమ్ కేర్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.
 


ఇకపోతే ఈ మూవీ ని 3 గంటల 01 పైగా నడివితో ఈ చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇలా భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సినిమా అంతా బాగానే ఉంది కానీ రన్ టైమ్ మాత్రం చాలా ఎక్కువ అయింది అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దీనితో త్వరగా స్పందించిన ఈ మూవీ బృందం తాజాగా ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ రన్ టైమ్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తూ ఈ మూవీ రన్ టైమ్ ఇకపై కేవలం 2 గంటల 37 నిమిషాలే మాత్రమే ఉండనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ఈ మూవీ రన్ టైమ్ ను తగ్గించడంతో ఈ మూవీ కి ఈ అంశం చాలా కలిసివచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: