అలాంటి వారి పరిస్థితి బాగోలేదంటున్న అనిల్ రావిపూడి...!!

murali krishna
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి .ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింద. ప్రస్తుతం ఎంతో అద్భుతమైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని శ్రీ లీల గ్లామర్ షో గురించి అలాగే డాన్స్ ల గురించి ప్రశ్నించారు. సినిమాలో శ్రీ లీల గ్లామర్ షో లేదని అలాగే ఈమె డాన్స్ కూడా చేయలేదు అంటూ చాలామంది రివ్యూస్ రాశారు ఈ రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఒక రిపోర్టర్ అనిల్ రావిపూడిని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ... ఇలాంటి రివ్యూల గురించి తాను ఏమాత్రం పట్టించుకోనని తెలియజేశారు. ఇలా రివ్యూ రాసే వారి కన్నా ఒకరి నోటి నుంచి సినిమా బాగుందని వస్తే అదే సినిమాకు ప్లస్ పాయింట్ అని అప్పుడే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్తారని అనిల్ రావిపూడి తెలిపారు.

ఈ సినిమాలో శ్రీ లీల గ్లామర్ షో చేయలేదు డాన్స్ లేదు అనే రివ్యూ రాసిన వారి గురించి మాట్లాడాల్సి వస్తే ఈ సినిమాలో ఒక ఫోబియాతో బాధపడుతున్నటువంటి కూతురిని బాధ నుంచి బయటకు తీసుకువచ్చి ఒక శివంగిలా తయారు చేయాలనే తపన పడుతున్న తండ్రి కథ ఆధారంగా సినిమా చేసినది ఇలాంటి సినిమాల్లో కూడా గ్లామర్ షో డాన్సులు ఉండాలి అనుకుంటున్నారు అంటే వారి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని అర్థం అంటూ అనిల్ రావిపుడి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: