రాజమౌళి కి పోటీగా అలాంటి పని వివేక్ అగ్నిహోత్రి చేస్తున్నాడా...??

murali krishna
భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు సినిమాటిక్ సబ్జక్ట్స్. ఈ రెండిటి పై పలు భాష ల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. కథ ఒకటే అయినా ఎవరి దృష్టి కోణంలో వారు తెరకె క్కించారు.కొన్ని బాక్సాఫీస్ విజయం సాధించాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఆదిపురుష్ టైటిల్ తో ప్రభాస్ రామాయణ చేశారు. ఆధునిక ధోరణి లో తెరకెక్కిన ఆదిపురుష్ హిందువుల మనో భావాలు దెబ్బతీసింది. బాక్సాఫీస్ ఫలితం కూడా నెగిటివ్ గా వచ్చింది.ఆదిపురుష్ చిత్ర యూనిట్ మీద ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శలు గు ప్పించాడు. కనీస పరిజ్ఞానం, పరిశోధన లేకుండా రామా యణం తీయడం సరికాదు. అలాగే ఎవరిని పడితే వాళ్ళను రాముడి గా జనాలు ఒప్పుకోరని చురకలు వేశాడు. ఆదిపురుష్ చిత్రం పై పరోక్ష విమర్శలు చేసిన అగ్నిహోత్రి మహాభారత ప్రకటించడం చర్చకు దారి తీసింది.

కన్నడ రచయిత పద్మ భూషణ్ డాక్టర్. డిఎల్ భైరప్ప ‘పర్వ’ పేరు తో మహాభారతం రాశారు. సంస్కృత మహాభారతాని కి తన దృష్టి కోణం లో భైరప్ప ఆధునిక రూపం ఇచ్చాడు. ఈ పర్వ ఆధారంగా అదే టైటిల్ తో వివేక్ అగ్నిహోత్రి మహాభారత తెరక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. ఇది మూడు భాగాలు గా విడుదల కానుంది. ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్ ప్రక టించడం చర్చకు దారి తీసింది.ది కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తం గా వివాదం రాజేసింది. రాజకీయ ఆరోపణల కు కారణమైంది. కాగా రాజమౌళి మహా భారత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. వివేక్ అగ్నిహోత్రి పర్వ ప్రకటన తో ఆయనకు పోటీ ఇచ్చినట్లు అయ్యింది. ఆదిపురుష్ ఫెయి  ల్యూర్ అనంతరం… రామాయణ, మహాభారతాలను సౌత్ డైరెక్టర్స్ బెస్ట్. నార్త్ డైరెక్టర్స్ అంత గొప్ప గా తెరకె క్కించలేరనే నానుడి బలపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: