మాస్ మహారాజా
రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ కి
వంశీ దర్శకత్వం వహించగా ... నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ
మూవీ లో
రవితేజ కు జోడిగా నటించారు. ఇకపోతే ఈ
మూవీ లో
మురళి శర్మ , అనుపమ్ కేర్ , నాజర్ కీలక పాత్రలలో నటించగా ... జీవి ప్రకాష్
కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ
మూవీ తాజాగా
అక్టోబర్ 20 వ తేదీన
దసరా పండుగ సందర్భంగా
థియేటర్ లలో విడుదల అయింది.
ఈ
మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు
దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. దానితో
రవితేజ ఈ
మూవీ లో బందిపోటు
దొంగ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ
మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఈ
మూవీ తెలుగు తో పాటు నిన్న అనగా
అక్టోబర్ 20 వ తేదీన
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ప్రస్తుతం విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ యొక్క సాటిలైట్ హక్కులను
స్టార్ మా సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ
మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ
మూవీ స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.