మరోసారి భారీగా రెమ్యూనరేషన్ పెంచిన లేడీ సూపర్ స్టార్....!!

murali krishna
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయన తార ఒకరు. నయనతార ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే మొదటి సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.ఇలా హిందీ సినిమా అవకాశాలతో పాటు ఈమె తెలుగు తమిళ భాష సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం నయనతార తన 75వ చిత్రంలో నటిస్తుంది. జయం రవికి జంటగా తనివొరువన్ 2తో పాటు కొన్ని చిత్రాలలో నటిస్తుంది.
వీటితోపాటు మరికొన్ని సినిమా కథలను కూడా ఈమె వింటున్నట్టు సమాచారం అయితే ఇకపై తాను కమిట్ అవుతున్నటువంటి సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..  ఈమె జవాన్ సినిమా  కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు ఇంత రెమ్యూనరేషన్ ఇప్పటివరకు సౌత్ లో ఏ హీరోయిన్ కూడా తీసుకోలేదు ఈమె రెమ్యూనరేషన్ టైర్ 2 హీరోల రెమ్యూనరేషన్ తో సమానం అని చెప్పాలి. ఈ విధంగా జవాన్ సినిమా కోసం పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి నయనతార ఇప్పుడు తన తదుపరి సినిమాలకు అదనంగా మరో మూడు కోట్ల రూపాయలు జోడిస్తూ ఏకంగా 13 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారట. తనకు 13 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమా చేస్తానని లేకపోతే లేదు అంటూ నిర్మొహమాటంగా ఈమె సమాధానం చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఈమె ఇంత డిమాండ్ చేసినప్పటికీ నిర్మాతలు మాత్రం ఈమెకు అవకాశాలు కల్పిస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: