సుప్రీంకోర్ట్ తీర్పు పై మంచు లక్ష్మి రియాక్షన్ అదే....!!
సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు చాలామంది ఈ విషయంపై స్పందిస్తున్నారు. కాగా ఈ కీలక తీర్పు పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం వ్యక్తం చేయగా ఈ తీర్పు విషయంపై ఆర్ఎస్ఎస్, ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా స్వాగతించాయి. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈ వ్యవహారం మీద తాజా గా స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియా లో వరల్డ్ గా మారింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై నేను చాలా నిరాశతో రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది అని ఆమె పేర్కొన్నారు అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం అని పేర్కొన్న ఆమె ప్రేమ ను ప్రపంచానికి చాటి చెప్పిన స్వంత దేశంలో దీనిని తిరస్కరించారని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.