ఈ
మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బ్యూటీఫుల్
హీరోయిన్ గా మాత్రం ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత తెలుగులో కాస్తా గ్యాప్ తీసుకుంది ఈ భామ.ఇప్పుడు మళ్లీ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే పవన్
కళ్యాణ్ - సుజీత్ ప్రాజెక్ట్ ఓజి సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో తెలుగులో ఈ అమ్మడు కెరీర్ మరో మలుపు తిరుగుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అలాగే
టాలీవుడ్ లో మరో చిత్రంలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.నేచురల్ స్టార్
నాని -
వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఎంపికైందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ
బ్యూటీ మరిన్ని సినిమాలు ఓకే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక తమిళంలో
ప్రియాంక మోహన్ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.
ధనుష్ తో భారీ బడ్జెట్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్' అలాగే జయం రవితో 'బ్రదర్' అనే చిత్రంలో
ప్రియాంక నటిస్తోంది. ఇక
విజయ్ దళపతి 68వ చిత్రంలో ఈ
భామ ఆఫర్ దక్కించుకుంది.. దీంతో ఈ
భామ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ
ప్రియాంక మోహన్ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేస్తుంది.. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ
బ్యూటీ చీర కట్టు లో కనిపించి ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ
బ్యూటీ ఆరెంజ్ శారీలో మెరిసి మెస్మరైజ్ చేసింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లకు
క్రష్ గా మారింది..