మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తన తండ్రి అయినటువంటి చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ లో చరణ్ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం తప్ప ఇంతకు మించి ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు.
ఇకపోతే ఈ మూవీ నుండి లీక్స్ మాత్రం బాగానే జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ఫోటోలు ... వీడియోలు లీక్ కాగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి "జరగండి జరగండి" అంటూ సాగే ఓ సాంగ్ కూడా లీక్ అయింది. ఇక ఈ సాంగ్ లిక్ కావడంతో ఇదే పాటను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసే ఆలోచనలో ఉంది అని ఓ వార్త బలంగా వైరల్ అయింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ మేకర్స్ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి ఎలాంటి పాటను కూడా విడుదల చేసే ఆలోచనలో లేదు అని తెలుస్తుంది.
ఇన్ని రోజుల వరకు ఈ సినిమా నుండి దసరా పండుగ సందర్భంగా సాంగ్ విడుదల అవుతుంది అని చరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సాంగ్ కోసం ఎదురు చూశారు. మళ్లీ ఈ మూవీ నుండి ఎలాంటి సాంగ్ కూడా ఇప్పట్లో విడుదల లేదు అని వార్తలు రావడంతో చరణ్ అభిమానులు ఈ మూవీ యూనిట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.