స్టేజ్ పైనే అలా అడిగి తేజస్వి పరువు తీసేసిన యంగ్ హీరో....!!

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇక కేరింత, ఐస్ క్రీమ్ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమా వల్లే మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ప్రెగ్నెంట్ అంటూ స్టేజి పైనే యంగ్ హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి.తాజాగా విశ్వక్సేన్ ఒక కొత్త షో ఫ్యామిలీ ధమాకా షో కి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ షోలో దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోయిన్లు చాందిని, అనీషా, అనన్య, తేజస్వి, సిమ్రాన్ చౌదరి తో పాటు ఇంకొంతమంది సందడి చేశారు. ఇకపోతే ఓటీటి షో కావడంతో డబుల్ మీనింగ్ డైలాగ్ లతో రెచ్చిపోయాడు విశ్వక్.. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో వీరిని ఆడుకున్నారనే చెప్పాలి.

ఇకపోతే విశ్వక్ మాట్లాడుతూ.. అనీషా రెండేళ్ల నుంచి నా మీద చాలా కోపంగా ఉంది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోలీ రోజు సిగ్గులేకుండా వెళ్లి వాటర్ కొట్టినా ,కలర్ కొట్టినా అని అలిగి వెళ్లిపోయింది. సారీ అనీషా అంటూ విశ్వక్ అనగా.. ఆ ఆప్షన్స్ నాకు ఉన్నాయా అంటూ తేజస్వి అడగడంతో స్టేజిపైనే విశ్వక్ కౌంటర్ వేశాడు. ఇక దానికి తేజస్వి నాకు ఆప్షన్స్ ఉన్నాయి అని అనడంతో షాక్ అయిన వెంటనే నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు అంటూ పరువు తీశాడు విశ్వక్.. ఇక ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది.ఆ తర్వాత విశ్వక్ మాట్లాడుతూ.. నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావు తేజు.. ముగ్గులో కి దించుతావు కానీ అంటూ మరో సందర్భంలో పంచ్ ఇచ్చాడు. ఇక తర్వాత ముద్ద ముద్దు అంటూ ఇద్దరు రెచ్చిపోయారు. చివర్లో పరేషాన్ హీరోయిన్ సమోసా తింటావా విశ్వక్ అని అడిగింది నువ్వు ఉండగా అది ఎందుకు అంటూ కౌంటర్ వేశాడు మొత్తానికి అయితే ఈ ప్రోమో చాలా బోల్డ్ గా నడిచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: