వైరల్ గా మారిన జక్కన్న ఫొటోస్...!!

murali krishna
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాహుబలితో తన సత్తా చాటితే ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు అలర్ట్ అవుతారు. సినిమా అనౌన్స్ చేశారంటే మరో రెండేళ్లు ఎదురుచూడాల్సిందే అనే ఢీలా కూడా పడుతారు. పర్వెక్ట్ గా, పక్కాగా ప్లాన్ గా ఉండాలని ప్రతి విషయంలో జాగ్రత్త పడుతారు జక్కన్న. శాంతినివాసం అనే సీరియల్ ను డైరెక్ట్ చేసి తన కెరీర్ ను స్టార్ట్ చేసిన రాజమోళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన టాలెంట్ ను ప్రపంచవ్యాప్తం గా నిరూపించుకున్నారు.
అయితే కె రాఘవేంద్ర రావు దగ్గర డైరెక్షన్ నేర్చుకున్న జక్కన్న స్డూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్షన్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఇప్పటికి దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఫ్లాప్ లు లేని డైరెక్టర్ ఎవరు అంటే చిత్రసీమలో జక్కన్న పేరే వినిపిస్తుంది. సింహాద్రి,సై,విక్రమార్కుడు,యమదొంగ,మగధీర,మర్యాదరామన్న,ఈగ,బాహుబలి 1 ,బాహుబలి 2 ,ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలను ఇప్పటి వరకు తెరకెక్కించి అపజయం అంటే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రతి ఒక్కరు సక్సెస్ కి కారణం అడిగితే చాలా కారణాలు చెబుతారు. వారు ఎదుర్కొన్న సమస్యలు, వాతావరణం ఇలా ఎన్నో చెబుతారు కానీ రాజమౌళి మాత్రం తన ఫ్యామిలీ అంటారు.అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి బెస్ట్ ఉదాహరణలా కనిపిస్తారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పుడు మహేష్ తో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ కు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఉన్నాయి. అవి మీకోసం ఓ సారి లుక్ వేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: