లియో: నో డౌట్.. విజయ్ కేరీర్లో బిగ్గెస్ట్ హిట్?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాని AP/TGలోని ఆడియన్స్ తమిళ ఆడియన్స్ కంటే ముందుగానే  చూస్తారు.తెలుగులో ఈ సినిమా ఎర్లీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 4,5 ఇంకా 7కి  షోలు షెడ్యూల్ చేయబడ్డాయి. దసరా సందర్బంగా దేశావ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమాల సగటు ఆక్యుపెన్సీ విషయంలో కూడా  లియో టాప్ లో వుంది. 55% లియో ఉండగా భగవంత్ కేసరి  13.3% ఇంకా టైగర్ నాగేశ్వరరావు 7% ఆక్యుపెన్సి ఉంది. ఇక ఏపీలో లియో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో విడుదలకి ముందే 30CR మార్కును తాకింది. లియో  హైదరాబాద్ - ఉదయపు షోల టిక్కెట్ల కోసం భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. అందుకే ఎగ్జిబిటర్లు ఉదయం 7 గంటల షోలు వెయ్యనున్నారు.



ఈ దసరా విడుదలలలో బుక్ మై షో లో టిక్కెట్లు గత 24 గంటల్లో లియోవే ఎక్కువ సేల్ అయ్యాయి. లియో  373.64K, భగవంత్ కేసరి 32.84K, టైగర్ నాగేశ్వరరావు 9.34K, ఘోస్ట్,  గణపత్ సినిమాలు ఇంకా ట్రెండింగ్‌ను ప్రారంభించలేదు. అంతేగాక లియో 2023లో USA ప్రీమియర్‌ల నుండి ఒక మిలియన్ డాలర్ మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.లియో AP/TS బుకింగ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయి.ఈ చిత్రానికి కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద పెద్ద సిటీల్లో కూడా బుకింగ్‌లు అద్భుతమైన నోట్‌తో ప్రారంభమయ్యాయి. లియోతో AP/TSలో విజయ్ కి తన సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గ్యారెంటీ. లియో సినిమాకి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అలాగే అనిరుధ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: