చీర కట్టులో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కిల్లింగ్ లుక్స్ లో అలరిస్తున్న అనసూయ..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ఎంతోమంది యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా మొదట యాంకరింగ్ రంగం లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం మోస్ట్ క్రేజీయస్ట్ నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో అనసూయ ఒకరు.ఈమె మొదట ఓ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి సూపర్ క్రేజ్ ను ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో తన నటనతో అంతకుమించిన అందచందాలతో ప్రేక్షకులను అలరించడంతో వరుస సినిమా అవకాశాలు అనసూయకు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ నటికి వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ ఫీల్డ్ కు దూరంగా ఉంటూ కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తుంది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అలాగే కొన్ని సందర్భాలలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా అనసూయ రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: