విజయ్ 13వ సినిమా టైటిల్ విడుదల తేదీని... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినప్పటికీ ఈ మూవీ కి చిత్ర బృందం మాత్రం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ విజయ్ కెరియర్ లో 13 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
 


చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ మూవీ టైటిల్ ను ఈ నెల 18 వ తేదీన 18 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు ఇప్పటికే "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇదే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: