'మిర్చి' మూవీ ను మిస్ చేసుకున్న మాస్ మహారాజ్...!!
అయితే కొరటాల శివ భద్ర సినిమాకి మాటలను అందించడం జరిగింది. ఇక ఆ చనువుతోనే రవితేజ కి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా స్టోరీ ని తీసుకెళ్ళి ప్రభాస్ కి చెప్పడం జరిగింది.ప్రభాస్ కి ఈ కథ నచ్చినప్పటికి అంతకు ముందే ప్రభాస్ బాహుబలి సినిమా కమిట్ అయిపోవడం సినిమా చేయాలా, వద్దా అని రాజమౌళి దగ్గర క్లారిటీ తెలుసుకొని బాహుబలి సినిమాకి ఇంకా కొంచెం టైం పడుతుంది అని రాజమౌళి చెప్పడంతో ఆ గ్యాప్ లో మిర్చి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా పెట్టి శ్రీమంతుడు అనే సినిమా చేశాడు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశాడు ఇది కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన దేవర సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.