వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న కోలీవుడ్ హీరో....!!

frame వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న కోలీవుడ్ హీరో....!!

murali krishna
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్  తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు.ఇటీవలే రాజ్‌కమల్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీస్‌లో ఉలగనాయగన్ కమల్ హాసన్‌ను కలిశాడు హీరో శివకార్తికేయన్‌.తన తరువాత సినిమా ఎస్‌కే 21 ను కమల్ హాసన్ నిర్మించ బోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో హీరో శివకార్తికేయన్ ఇదివరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది..ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళి సందర్బంగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నారు. అంతేకాదు నెక్ట్స్‌ షెడ్యూల్‌ చెన్నైలో షురూ కానుండగా.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా  కొనసాగనున్నాయట.


 ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌లో దిగిన ఫొటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. కశ్మీర్‌లో 75 రోజులపాటు జరిగిన లాంగ్ షెడ్యూల్‌ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా కోసం గైడ్‌ చేసిన రియల్‌ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు మేకర్స్‌ ధన్యవాదాలు తెలియజేశారు. రంగులు చల్లుకుంటూ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌ లో స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకున్న స్టిల్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..హీరో శివ కార్తికేయన్ మరోవైపు అయలాన్  చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాను సంక్రాంతి కానుక గా విడుదల చేయనున్నట్లు సమాచారం.అయలాన్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.భూమి మీద జరిగే కొన్ని పరిణామాలు భూమి అంతానికి దారి తీస్తాయి. ఆ విపత్తు నుండి ఒక ఏలీయన్ ఎలా భూమిని రక్షిస్తుంది అనేది ఈ సినిమా స్టోరీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: