అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో పాటు అదిరిపోయే అందచందాలతో కూడా తెలుగు కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుస సినిమా అవకాశాలు తెలుగులో దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న తలపతి విజయ్ హీరోగా రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ మూవీ కి వెంకట్ ప్రబు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ హాట్ అందాలను ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
అలాగే అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీ ని కట్టుకొని పింక్ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.