తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను చాలా రోజుల క్రితం డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ ని డిసెంబర్ 21 వ తేదీన కాకుండా డిసెంబర్ 7 వ లేదా 8 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 15 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ మూవీ కి ఖుషి మూవీ కి సంగీతం అందించినటు వంటి వషిం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించాడు. ఇప్పటికే హాయ్ నాన్న మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే దసరా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నాని ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.