అదిరిపోయే రేంజ్ లో "గుంటూరు కారం" ప్రచారాలు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా ... మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం ఒక చిన్న వీడియోను మరియు ఒకటి రెండు పోస్టర్ లను కూడా విడుదల చేసింది.


వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి సాంగ్ ను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచన లో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా మరో ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రచారాలను కూడా ఈ సంవత్సరం దసరా పండుగగా సందర్భంగా మొదలు పెట్టబోతున్నట్లు ఆ తర్వాత నుండి ఎప్పటి కప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను విడుదల చేయబోతున్నట్లు అలా ఈ సినిమా విడుదల వరకు ఈ మూవీ ప్రచారాలను కొనసాగించే విధంగా ఈ చిత్ర బృందం వారు ప్రస్తుతం ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది . ఇక పోతే ఈ మూవీ పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: