
తన స్టైల్ లో అందరికి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్....!!
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకను ఏర్పాటు చేయించి అందరిని ఆహ్వానించు వారికి విందు భోజనాలు ఏర్పాటు చేయించారు అయినప్పటికీ ఈవెంట్లో అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎవరు రాకపోవడంతో పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం శిరీష్ అలాగే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాత్రమే కనిపించారు. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అయితే వీరిద్దరూ లండన్ లో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిసినప్పటికీ అల్లు అరవింద్ ఆయన భార్య రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ గతం నుంచి వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఈ వేడుకకు అరవింద్ దంపతులు రాకపోవడంతో ఈ వార్తలు నిజమేనని మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి అల్లు అరవింద్ దంపతులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అనే విషయం తెలియక పోయినప్పటికీ మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్తలు తీసుకున్నారట అయితే పెళ్లి విషయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఆహ్వానించాలని తప్పనిసరిగా ఈ పెళ్లి వేడుకలో అందరూ ఉండేలా జాగ్రత్త పడాలని తెలియజేశారట ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మెగా కుటుంబ హీరోలందరికీ కూడా చిరంజీవి ఇదే విషయాన్ని తెలియజేశారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ పెళ్లి వేడుక దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అతని పెళ్లి సమయంలో హీరోలందరూ కూడా తమ సినిమాకు విరామం ప్రకటించాలని చిరంజీవి చెప్పారట పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాల నుంచి కొంత సమయం పాటు విరామం తీసుకుని ఈ పెళ్లి వేడుకలలో హాజరయ్యే విధంగా చిరంజీవి ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది దీంతో తన అన్నయ్య కొడుకు పెళ్లి వేడుకలకు హాజరయ్యే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన షెడ్యూల్ మార్చుకున్నారట ఇటలీలో పెళ్లి జరుగునున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటలీ వెళుతున్నటువంటి సందర్భంగా పార్టీ బాధ్యతలు అన్ని నాదెండ్ల మనోహర్ కి అప్పగించారని కూడా తెలుస్తోంది. ఇలా మెగా కుటుంబంలో జరగబోతున్నటువంటి ఈ వేడుకకు కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలని చిరంజీవి అందరికీ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. మరి ఈ పెళ్లి వేడుకలలో పవన్ కళ్యాణ్ వారసులు పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.