రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ మూవీ....!!
మరి ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజు కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది లోనే డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.మరి నితిన్, శ్రీలీల జోడీ ఎలా ఉంటుందో ఈ సినిమా ఆడియెన్స్ ను ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా నితిన్ ఈ సినిమాతో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. భీష్మ కాంబో మరోసారి రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అలాగే ఈ రెండింటితో పాటు మరో సినిమా కూడా అనౌన్స్ చేసారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''తమ్ముడు'' సినిమాను ప్రకటించాడు. చూడాలి ఇందులో నితిన్ కు ఏది బ్లాక్ బస్టర్ ఇస్తుందో.