రెండుసార్లు సెన్సార్ కట్ అయి కూడా.. మెగాస్టార్ పరువు తీసిన సినిమా ఏదో తెలుసా?
అయితే చిరంజీవి కెరియర్ లో కొన్ని సినిమాలు ఆయన కెరియర్ తో పాటు వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడితే కొన్ని సినిమాలు మాత్రం మెగాస్టార్ పరువు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అలాంటి సినిమాలలో ఒక మూవీ రెండు సార్లు సెన్సార్కు వెళ్లి కూడా చిరంజీవి పరువును తీసేసిందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అల్లుడా మజాకా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ, రంభ హీరోయిన్స్ గా నటించారు ఇక ఇద్దరు హీరోయిన్లకు తల్లి పాత్రలో వాణిశ్రీ నీ నటింప చేయాలని అనుకున్నాడట దర్శకుడు.
వాణిశ్రీ ని కలిసి ఆమె పాత్రను కూడా వివరించాడట. అయితే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణిశ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా పోటీపడి మరి నటించారు. కానీ అల్లుడా మజాకా సినిమాలో వాణిశ్రీ మరోసారి చిరంజీవికి అత్తగా నటించే అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించారట ఆ తర్వాత దర్శకుడు లక్ష్మితో ఆ పాత్రను వేయించారు. అయితే వాణిశ్రీ చిరంజీవి అత్త అల్లుళ్ల కాంబోలో వచ్చిన సినిమా సూపర్ హిట్ సాధిస్తే.. ఈ ఇమేజ్ ను రిపీట్ చేయాలని ఇవివి భావించారు. కానీ వాణిశ్రీ కి పాత్ర నచ్చకపోవడంతో ఆమె నటించలేదు. ఇక ఈ సినిమాలో వాణిశ్రీ నటించక పోవడానికి కారణం ఒ సన్నివేశంలో రమ్యకృష్ణ రంభ వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే రేప్ సీన్ అనేది తెలుస్తుంది. కాగా తర్వాత వాణిశ్రీ నటించిన పాత్రలో నటించిన లక్ష్మీ వేషధారణ కూడా బాలేదని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఈ సినిమా రెండుసార్లు సెన్సార్ కట్ అయిన కూడా చివరికి ఈ సినిమాతో చిరంజీవి పరువు పోయింది అని అప్పట్లో వార్తలు కూడా తెరిమిదకి వచ్చాయి.