ఆల్రెడీ ఆ బ్యూటీపై షూటింగ్ ను స్టార్ట్ చేసిన "నా సామి రంగ" యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అల్లరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న నాగార్జున కొన్ని రోజుల క్రితమే నా సామి రంగ అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్ లు కనిపించే అవకాశం ఉన్నట్లు అందులో ఒక హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఆశిక రంగనాథ్ ను చిత్ర బృందం హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది అంటూ ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాల్లో నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా ఈ బ్యూటీని ఓకే చేసినట్లు అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ హైదరాబాదు లో జరిగిన షూటింగ్ లో ఈ ముద్దు గుమ్మ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ లో నాగార్జున సరసన రెండవ హీరోయిన్ గా ఏ బ్యూటీ కనిపిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే విధంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను మరియు ఇతర పనులను ప్లాన్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: