సాయి తేజ్... సంపత్ నంది కాంబోలో మూవీ... టైటిల్ కూడా ఫిక్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే సాయి తేజ్ ఈ సంవత్సరం ఇప్పటికే విరూపాక్ష ... బ్రో సినిమాల్లో హీరోగా నటించాడు. ఇందులో విరూపాక్ష సినిమా అద్భుతమైన విజయం సాధించింది. బ్రో సినిమాలో సాయి తేజ్ ... పవన్ తో కలిసి హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.


ఇది ఇలా ఉంటే సాయి తేజ్ తదుపరి మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... సాయి తేజ్  తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సంపత్ నంది తో చేయబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే సంపత్ , సాయి కి ఓ కథను వినిపించగా ... ఆ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే సాయి , సంపత్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాయి తేజ్ , సంపత్ నంది కాంబోలో రుపొందబోయే సినిమా "గాంజా శంకర్" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సంపత్ నంది ఆఖరుగా గోపీచంద్ హీరోగా రూపొందిన సిటిమార్ అనే సినిమాకు దర్శకత్వం వహించి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: