నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం మంచి విజయంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటిన బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురి పాత్రలో శ్రీ లీల నటించగా ... అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
సైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మొన్న రాత్రి ఈ మూవీ బృందం వరంగల్ లో ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
దానితో ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయం ముగిసే సరికి 7.96 మిలియన్ వ్యూస్ ను , 243.5 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులు అయినటువంటి బాబి , గోపీచంద్ , మలినేని వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.