ఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
అయితే మ్యాడ్ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది.రోజురోజుకీ కలెక్షన్స్ పరంగా కూడా పెరిగిపోయి బ్లాక్ బస్టర్ విజయ దిశగా దూసుకుపోతోంది. నిన్నటి రోజున సాయంత్రం సక్సెస్ మిట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలలో చిత్ర బృందం పాల్గొని తమ ఆనందాన్ని సైతం తెలియజేసింది. ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ అని చెప్పవచ్చు. లక్ష్మి ప్రణతి తమ్ముడు కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
ట్రైలర్ కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయడంతో ఈ సినిమా మరింత విజయానికి చేరువయ్యింది. ఇందులోని ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మ్యాట్ సినిమా వారంలో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలకు పైగా చేరువలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వచ్చేవారం ఎటువంటి సినిమాలు విడుదల లేకుంటే కచ్చితంగా ఈ సినిమా మంచి విజయ దిశగా కొనసాగడం ఖాయమని చిత్ర బృందం తెలియజేస్తోంది. నిన్నటి రోజున ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా నితిన్ మాట్లాడుతూ ఈ సినిమాని సక్సెస్ కావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ కళ్యాణి గారి వల్లే అంటూ తెలిపారు. ఈ సినిమాని ఎన్టీఆర్ చూసి కూడా తెగ పొగిడేసారని తెలియజేయడం జరిగింది.