వెంకటేష్ కూతురి వెంట పడిన టాలీవుడ్ హీరో..??

murali krishna
సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. దగ్గుబాటి రామానాయుడు.ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈయన వారసులుగా వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలోకి రాగా సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డారు. ఇలా నిర్మాతగా సురేష్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయగా వెంకటేష్ ఎన్నో మంచి సినిమాలలో నటించి హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. వెంకటేష్ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నారు. ఇకపోతే వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే. మీరు పెద్ద కుమార్తె ఆశ్రితకు వివాహం చేశారు.

ఈమె కూడా ఫుడ్ వ్లాగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు పోస్టులకు రిప్లై ఇస్తూ ఉంటారు. ఇకపోతే వెంకటేష్ మరో కుమార్తె పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో కాస్త అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారికి తెలిసిన వ్యక్తులతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని తరచు ఆమెను సతాయించడమే కాకుండా తనని ప్రేమిస్తున్నాను అంటూ తన వెంట పడుతున్నారట.

ఇలా టాలీవుడ్ హీరో వెంకటేష్ కుమార్తె వెంటపడటంతో ఆమె ఇన్ని రోజులు పాటు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పకపోయినా ఆయన ప్రవర్తన మితిమీరడంతో ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేసిందని దీంతో వెంకటేష్ ఆ హీరోకి తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇప్పటివరకు వెంకటేష్ కుటుంబానికి సంబంధించి ఏ విధమైనటువంటి రూమర్లు సోషల్ మీడియాలో రాలేదు అలాంటిది ఆయన కూతురు పట్ల ఒక వ్యక్తి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే వెంకటేష్ ఇలాంటి వాటిని ఆదిలోనే తుంచి వేయాలని తనకు మాస్ వార్నింగ్ ఇచ్చారట.   త్వరలోనే దగ్గుబాటి అభిరామ్ వివాహం జరగబోతుంది. ఇలాంటి సమయంలో వెంకటేష్ కుమార్తె గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే వెంకటేష్ కుమార్తె వెంటపడుతున్నటువంటి ఆ హీరో రానాకు దోస్తుడు అనే విషయం తెలుస్తోంది. ఈ విషయం తెలిసి రానా కూడా ఆ హీరోకి తన స్టైల్ లోనే సమాధానం చెప్పారట. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ మొదటిసారి వెంకటేష్ కుమార్తెల గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో వెంకీ ఫాన్స్ ఈ వార్తలపై ఫైర్ అవుతున్నారు. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కావాలని ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని వెంకటేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: