సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న.. పవన్ కళ్యాణ్ హీరోయిన్?
అలాంటి హీరోయిన్లలో కీర్తి రెడ్డి కూడా ఒకరు. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో చేసింది కొన్ని సినిమాలే. కానీ ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఆమె ఇండస్ట్రీకి దూరమైన ఇంకా కీర్తి రెడ్డి ని ఆరాధించే అభిమానులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించినప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో మాత్రం ఆమె మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అర్జున్ సినిమాలో మహేష్ కు అక్కగా నటించి మెప్పించింది కీర్తి రెడ్డి. అయితే అక్కినేని హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుని కీర్తి రెడ్డి లైఫ్ లో సెటిల్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కానీ వీరి వైవాహిక బంధం మున్నాళ్ళ ముచ్చటగానే మారిపోయింది. సుమంత్ కీర్తి రెడ్డి విడాకులు తీసుకొని వేరుపడ్డారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుందట. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు కొంతమంది డైరెక్టర్లు చెబుతున్న కథలు వింటుందని టాక్.