లియో సెన్సార్ పూర్తి.. ట్రైలర్ రిలీజ్ ఈరోజే..!!

Divya
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విజయ్ తలపతి తాజాగా నటిస్తున్న చిత్రం లియో.. ఈ సినిమా మోస్ట్ అవైడెడ్ చిత్రంగా టాప్ ప్లేస్ లో పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకత్వం డైరెక్టర్ లోకేష్ కనకరాజు వ్యవహరించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే ముఖ్యమైన పాత్రలో అర్జున్ దాస్ నటిస్తూ ఉండగా.. శ్రీయ రెడ్డి కూడా నటిస్తోంది. విలన్ గా సంజయ్ దత్ నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లేవల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ సినిమా హైప్ ని పెంచేస్తూ ఉన్నది. చిత్ర బృందం ఈ రోజున లియో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది .ఈ నేపథ్యంలోనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం..U/A సర్టిఫికేట్ వచ్చిందని మేకర్స్ సైతం తెలియజేశారు. సెన్సార్ సభ్యులు తెలిపిన ప్రకారం కొన్ని సన్నివేశారులు విజయ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఆయన కెరియర్ లోనే బెస్ట్ సినిమాలలోని లియో ఉంటుందని తెలియజేసినట్టు సమాచారం.

దీంతో అభిమానులు ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో అర్జున్ సబ్జా కూడా విలన్ గా నటిస్తున్నారని సమాచారం. లోకేష్ ఈ సినిమాని యూనివర్సల్ లియోలో కూడా ఉందని రోలెక్స్ కు సంబంధించిన పాత్ర కూడా ఇందులో చూపించబోతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది అప్పటివరకు వేచి ఉండాల్సిందే. మరి ఈ రోజున విడుదల కాబోతున్న లియో సినిమా ట్రైలర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: