నిహారిక కంటే ముందు ఆ పని చేయబోతున్న చైతన్య..!!

Divya
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య మూడేళ్ల క్రితం ప్రేమించి మరి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జైపూర్లో వేరే వివాహం చాలా గ్రాండ్గా జరిగింది అయితే ఈ ఏడాది జులై నెలలో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అటు నిహారిక ఇది చైతన్య కూడా వ్యక్తిగత కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం నిహారిక సినిమాల పైన ఫోకస్ పెడుతూ ఉన్నది. అయినా కూడా సక్సెస్ కాలేకపోతోంది సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది నిహారిక.

విడకుల తీసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన బాధ నుంచి రిలీఫ్ కోసం వెకేషన్ కు వెళ్తూ ఉంటుంది. నిహారిక అప్పుడప్పుడు ఫ్యామిలీతో పాటు సింగిల్ గా కూడా వెళుతూ ఉంటుంది. ప్రస్తుతం నిహారిక పెళ్లి ఆలోచన గురించి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని నిహారిక మాజీ భర్త చైతన్యకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. త్వరలోనే చైతన్య ఒక ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిహారికతో బ్రేకప్ అవ్వడంతో చాలా బాధపడ్డ చైతన్య వెకేషన్ కి వెళ్లి ఆ బాధ నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడే మరొకసారి పెళ్లి ఆలోచన పెట్టుకోలేదట. కానీ ఇంట్లో వాళ్ల ప్రెజర్ తో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది సమాచారం. తమ కుటుంబానికి బాగా తెలిసిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఒక ఐపీఎస్ అధికారి కూతురని సమాచారం. ఇంతకు సంబంధించి ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా అన్ని ఓకే అనుకొని పెళ్లి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: