శ్రీలీల మ్యానియాకు చెక్ పెట్టిన స్కంద !

Seetha Sailaja
క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇప్పటివరకు నటించిన సినిమాలు కేవలం రెండు మాత్రమే అయినప్పటికీ ఆమెకు ప్రేక్షకులలో ఆదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడిన మ్యానియాను చూసిన వారికి ఆమె రేంజ్ ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల అందరి టాప్ హీరోలతోను నటిస్తున్న విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా విడుదల అయిన ‘స్కంద’ మూవీలో ఆమె పాత్రను చూసిన విమర్శకులు ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమూవీలో ఆమె  పాత్రకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా రామ్ తో ఆమె నటించిన సన్నివేశాలలో అటు గ్లామర్ కాని ఇటు నటన కానీ ఏవిషయంలోను ఆమె ప్రత్యేకంగా కనిపించక పోవడంతో శ్రీలీల అభిమానులు చాలామంది షాక్ అయ్యారు. లేటెస్ట్ గా విడుదల అయిన ఈమూవీకి డివైడ్ టాక్ రావాదంతో రామ్ అదేవిధంగా దర్శకుడు బోయపాటి కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ ఈమూవీ ఇవ్వలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

‘ఉప్పెన’ మూవీ సూపర్ సక్సస్ తరువాత కృతి శెట్టి మ్యానయా విపరీతంగా పెరిగిపోవడంతో ఆమెకు వరసపెట్టి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె హీరోయిన్ పాత్ర చేస్తున్న కథల విషయాయంలో చేసిన పొరపాట్లు వల్ల ఆసినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారడంతో ఒక్కసారిగా ఆమె కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయి ప్రస్తుతం ఐరన్ లెగ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల ‘స్కంద’ మూవీలో నటించిన ప్రాధాన్యత లేని పాత్రను చూసిన వారికి ఆమె కూడ కృతి శెట్టి గతంలో చేసిన పొరపాట్లను చేస్తోందా అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

‘స్కంద’ శ్రీలీల మ్యానియా మరింత పెరగడానికి ఏమాత్రం సహకరించక పోవడంతో ఇక ఆమె ఆశలు అన్నీ దసరా పండుగకు విడుదలకానున్న ‘భగవంత్ కేసరి’ ఆతరువాత వైష్ణవ్ తేజ్ తో నటించిన ‘ఆదికేశవ’ సంక్రాంతికి రానున్న ‘గుంటూరు కారం’ ఆపై పవన్ తో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ శ్రీలీల కెరియర్ కు అత్యంత కీలకంగా మారనున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: